గత కొద్ది  రోజులుగా హిందువులు తమ పండుగలు వారు జరుపుకుంటుంటే  హిందువుల మీద వరసగా  దాడులు జరుగుతున్నాయి. ఏప్రిల్ 02 తారీఖున కరౌలిలో  హిందూ నూతన సంవత్సర సందర్బంగా ఊరేగింపు జరగగా ఊరేగింపులో స్థానిక ముస్లింలు రాళ్లు రువ్వారు.ముస్లింలు ఆధిపత్యం ఉన్న ప్రాంతంలో ఊరేగింపు జరగగా , ఊరేగింపులో హిందువులు రెచ్చగొట్టే పాటలు పాడడం వల్లే హింసకు దారితీసింది అని రాజస్థాన్ పోలీసులు వాపోయారు.

ఇది ఇలా ఉండగా నిన్న రామనవమి రోజు కూడా పై తరహాలోలాగే  దేశం మొత్తంలో పలు చోట్ల హిందువుల పై  దాడులు జరిగాయి.

హౌరాలోని షిబ్‌పూర్‌లోని జీటీ రోడ్డులోని పీఎం బస్తీ వద్ద ఫజీర్ బజార్ సమీపంలో వీహెచ్‌పీ నిర్వహించిన రామనవమి ఊరేగింపుపై స్థానిక ముస్లింలచే రాళ్ల దాడి జరిగింది.

గుజరాత్లోని హిమ్మత్నగర్లో, జార్ఖండ్లోని, కర్ణాటకలో లోహార్దాగ ముల్బాగల్లో హిందువులపై ఇలాంటి దాడులు జరిగాయి.


ఎన్ డి టీవీ రిపోర్టర్ శ్రీనివాసన్ జైన్  ఈ హింసకు కారణం హిందువులు ముస్లింలు ప్రాంతంలో నుండి వెళ్లడమే అని అన్నారు.