ఒరిస్సా జోడలోని ఇస్లాంవాదులు రామనవమి అఖాడా ఉరేగింపు పై రాళ్ళూ గాజుసీసాలు రువ్వారు
ఒరిస్సా జోడలో రామనవమి ఊరేగింపుపై, పోలీసులుపై స్థానిక ముస్లింలు దాడి :
సోమవారం, ఒరిస్సా కియోంజర్ జిల్లా జోడా పట్టణంలో హిందూ భక్తులు రామనవమి సందర్భంగా అఖాడా ఊరేగింపు నిర్వహిస్తున్నారు. అయితే ఉరేగింపుపై స్థానిక ముస్లింలు రాళ్లు, గాజు సీసాలు రువ్వారు మరియు మోటార్ వాహనాలు తగులుపెట్టారు. దీనితో అక్కడ ప్రాంతాలో ఉద్రిక్తత చోటుచేసుకొంది హింసాకాండ నేపథ్యంలో జిల్లా పోలీస్ ఏంత్రాంగం ఆ ప్రాంతంలో 144వ సెక్షన్ విధించింది.
నివేదికల ప్రకారం ఆదివారం రామనవమి సందర్భంగా అఖాడా ఊరేగింపు నిర్వహించాలి అని కోరుకున్నారు. ప్రతి సంవత్సరం ఆచరించే రామనవమి ఆచారాలకు అనుగుణంగా ప్రతి హిందూ దేవాలయానికి కాషాయ జెండాను తీసుకువెళ్ళడానికి భక్తులు ప్రభుత్వం అనుమతి కోరారు, అయితే పోలీసులు ఆదివారం అనుమతి నిరాకరించారు. మరియు సోమవారం ఊరేగింపు పూర్తిచెయ్యడానికి సంఘంలోని ఐదుగురు సభ్యులను మాత్రమే అనుమతించారు.
ఏప్రిల్ 11వ తారీఖున హిందువులు కాషాయ జెండాలను పట్టుకొని 4వ వార్డు లో ఉన్న శివుని గుడికి చేరగానే అక్కడ ఉన్న స్థానిక ముస్లిం నిరసనకారులు రోడ్డు బ్లాక్ చేసి భక్తులతో వాదనకు దిగారు. ముస్లింలు ఆలయ పరిసరాలకు కూడా భక్తులను అనుమతించలేదు మరియు వారిపై రాళ్లు, గాజుసీసాలు రువ్వారు. ఈ గొడవలో చాలామంది గాయపడ్డారు.
పరిస్తినిసద్దుమణిగించడాయికి వచ్చిన పోలీసులు పై కూడా ఆందోళనకారులు రాళ్లు ,గాజుసీసాలు రువ్వారు మరియు ఆలయ పరిసరాల్లో ఉన్న దుకాణాలను ధ్వంసం చెయ్యడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. దీనితో పోలీసులు అల్లరి గుంపును చెదరుకొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. మంగళవారం ఉదయం 10 గంటల వరకు పట్టణంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144 కింద పోలీసు అధికారులు నిషేధాజ్ఞలు విధించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
0 కామెంట్లు