బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ రాముడు దేవుడు కాదు అని వాల్మీకి, తులసీదాస్ సృష్టించిన పాత్రమాత్రమే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. రాముణ్ణి తాను గౌరవించను అని అన్నారు. 

రాముడు అసలు దేవుడే కాదు వాల్మీకి మరియు తులసీదాస్ తమ సందేశాలను వ్యాప్తి చెయ్యడానికి సృష్టించిన పాత్ర అని భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి బి.ఆర్  అంబేద్కర్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీహార్ మాజీ సీఎం జితిన్ రామ్ మాంఝీ అన్నారు. వారు రామాయణం రాసారు వారి రచనల్లో ఎన్నో మంచి పాఠాలు ఉన్నాయని జితన్ వాటిని నమ్ముతాను అని మరియు ఆ రచనలు చేసిన వాల్మీకి, తులసీదాసును మాత్రమే నమ్ముతాను రాముణ్ణి కాదు అని బిజెపి నేతృత్వంలో ప్రజాస్వామ్య కూటమిలో భాగమైన హిందుస్తాన్ అవామ్ మోర్చా(HAM) చీఫ్ మాంఝీ అన్నారు.

రాముడు గురించి మాంఝీ తప్పుగా మాట్లాడం ఇది ఏమి మొదటిసారి ఏమి కాదు. గత సంవత్సరం మాంఝీ రాముడిని దేవుగుడిగా పరిగణించడానికి నిరాకరించాడు. మరియు పాట్నాలో భూయన్-ముషాహార్ కమ్యూనిటీ సమావేశంలో బ్రాహ్మణ పూజారులపై అవుమానకరమైన వ్యాఖ్యలు చేసాడు.