Pic From OpIndia 

దేశంలో హిందూ మతపరమైన ఊరేగింపులపై దాడులు కొనసాగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలోని జహంగీర్పూర్  లోని హనుమాన్ జన్మోత్సవ ఊరేగింపుపై ముస్లిం మూకలు రాళ్లతో కర్రలోతో హింసకు పాల్పడ్డారు. ముస్లింలు మైనర్ పిల్లలను కూడా హింసకు ఉపయోగించుకున్నారు. మరియు గుంపులు గుంపులుగా ఊరేగింపుపై దాడి చేసారు.  

ఊరేగింపు జహంగీర్పూర్ 'సి' బ్లాక్ గుండా వెళుతుండగా అకస్మాత్తుగా కొందరు అల్లరి మూకలు వారి ఇంటి పైకప్పు పై నుండి ఊరేగింపు మీద రాళ్ళూ రువ్వారు. దీనితో ఊరేగింపులో పాల్గున్న వ్యక్తులు కూడా  ఆ అల్లరి మూకలు పై తిరిగి రాళ్ళూ రువ్వడం ప్రారంభించారు.

ఆ తరవాత ఆ గుంపు హింసాత్మకంగా మారి, ఊరేగింపుతో మోహరించిన పోలీసులపై కూడా రాళ్ళలోతో తుపాకులతో  దాడి చేసారు. రిపబ్లిక్ టీవీ ప్రకారం ఒక పోలీసును చేతిపై తుపాకీతో కాల్చడం జరిగింది మరియు పోలీస్ వాహనాలను కూడా దుండగులు తగలుపెట్టారు. 

ఈ గొడవలో సబ్ ఇన్స్పెక్టర్ తో సహా  చాలామంది పోలీసులు గాయపడ్డారు వారిని స్థానిక బాబు జగ్జీవన్‌రామ్ మెమోరియల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సంఘటనలో ఇంకా చాల మంది పోలీసులు గాయపడి ఉండొచ్చు అని ఆందోళన వ్యక్తం చేసారు.

హింసాకాండ తరవాత మరింత హింసను నిరోధించడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు.