బుధవారం (13-04-2022)న జమ్మూకాశ్మీర్ కుల్గామ్ జిల్లాలో ఒక ఉగ్రవాది  సతీష్కుమార్ సింగ్ రాజపుత్  అనే పౌరుడిపై కాలుపులు జరిపాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ సతీష్ కుమార్ సింగ్ రాజపుత్ని , చికిత్స కొరకు ఆసుపత్రికి తీసుకు వెళుతుండగా మార్గం మధ్యలో మరణించాడు.

సతీష్ కుమార్ సింగ్ను  కుల్గామ్ జిల్లాలో పొంబే ప్రాంతంలో ఉగ్రవాది కాల్చి చంపాడు. సతీష్ వృక్తి రిత్యా డ్రైవర్ మరియు కుల్గామ్లోని కక్రాన్ నివాసి. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ మొదలు పెడతాం అని చెప్పారు. ఈ ఉగ్రవాద నేరంలో పాలుగున్న ఉగ్రవాదులను త్వరలోనే పట్టుకుంటాం అని తెలియచేసారు.

ఇంతలో కాశ్మీర్ లోయలో ఉన్న లష్కరే-ఇ-ఇస్లాం అనే ఉగ్రవాద సంస్థ "లెటర్ టు కాఫిర్ " అనే లేఖను జారీచేసింది. కాశ్మీర్ లోయలో ఉంటున్న Rss ఏజెంట్లు, కాశ్మీరీ పండితులకు మరియు వలసదారులకు  ఇదే చివరి హెచ్చిరిక లోయను వదిలి వెళ్లిపొమ్మని లేకపోతే చాల భయంకరమైన పరిణామాలు  ఉంటాయి అని బెదిరించారు. కాశ్మీరీ హిందువులు తమ ఆజ్ఞను ధిక్కరించిన వారిని చంపి నరకానికి పంపుతారని. ఈ విషయంలో మోదీ కానీ అమిత్షా కూడా మిమ్మలను రక్షించలేరు అని లేఖలో పేర్కొన్నారు. మరియు కాశ్మీరీ హిందువులు అక్కడ బ్రతకాలి అంటే వారు మతం మారాలని లేఖ పోతే అల్లాహ్ సైన్యం(ఉగ్రవాదులు) చేతిలో చస్తారు అని మరియు  వారిని నరకానికి పంపుతారు అని హెచ్చరిక జారీచేశారు.