రాజస్థాన్ ఉదయపూర్ లో కన్హయ్య లాల్ అనే టైలర్ ని నరికి చంపిన కొన్ని గంటల తరవాత ఉదయపూర్ పోలీస్ లు ఆ ప్రాంతం లో కర్ఫ్యూ విధించారు. ఆ ప్రాంతంలో ప్రజలు గుమిగూడకండా నిషేధాజ్ఞలు విధించారు. మతపరమైన అల్లర్లు జరగకుండా ఉండేందుకు పోలీసులు 144వ సెక్షన్ విధించారు మరియు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు.

నివేదికల ప్రకారం ఒక నెల రోజులు పాటు 144వ సెక్షన్ విధించబడింది. అయితే తదుపరి 24గం ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి కన్హయ్య లాల్ హత్యకు గురియైన కొన్ని గంటల అంటే 28వ తేదీ రాత్రినుండి పోలీసులు కర్ఫ్యూ విధించారు.

ఇద్దరు ఇస్లామిస్టులు మొహ్మద్ రియాజ్ అఖతారీ మరియు మొహ్మద్లు నిన్న అనగా 28 జూన్ మంగళవారం మధ్యాహ్నం కన్హయ్య లాల్ అనే దర్జీ నుపుర్ శర్మ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు దారుణంగా హత్య చేసారు. అయితే నుపుర్ శర్మకు సోషమీడియా ద్వారా మద్దతు తెలిపినందుకు కన్హయ్య లాల్ ను ఇదివరకే కన్హయ్య లాల్‌ను బెదిరించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. కన్హయ్య లాల్ మొబైల్ నుండి అతని 8 ఏళ్ల కుమారుడు పోస్ట్‌ను షేర్ చేసినప్పటి నుండి అతనికి హత్య బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.

గతంలో నుపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు కన్హయ్య లాల్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. అయితే అరెస్ట్ చేసిన తరవాత కూడా అత్తని చంపేస్తాం అని బెదిరింపులు వచ్చాయి. దీని పై బాధితుడు సమీప ధన్ మండి పోలీసుస్టేషన్ కు సమాచారం అందించి తమకు రక్షణ కల్పించమని కోరినప్పటికీ అక్కడ పోలీసులు నిర్లక్షంగా వ్యవహరించినట్టు సమాచారం. 

మంగళవారం తాము ఇరువురు అల్లాహ్ కోసమే దర్జీ తలను నరికి నట్టు ఒక వీడియోను విడుదల చేసారు ఉదయ్‌పూర్‌లోని మాల్దాస్ స్ట్రీట్‌లోని భూత్ మహల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరిద్దరినీ పొరుగు జిల్లా రాజ్‌సమంద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. 

దారుణమైన హత్య జరిగిన తరవాత రాష్ట్రంలో అనేక చోట్ల హింస చెలరేగింది ఆవేశంగా పోలీసులు పై రాళ్ళూ రువ్వారు ఉదయ్‌పూర్‌లోని హతిపోల్ ప్రాంతంలో రెండు మోటార్‌సైకిళ్లకు కూడా నిప్పు పెట్టారు. రాళ్లదాడిలో ఇద్దరు యువకులు, ఒక పోలీసు సిబ్బంది గాయపడినట్లు సమాచారం.

 

ఇంతలో సోషమీడియాలో మాతపరమైన ఉద్రిక్తత పోస్టులను గుర్తించమని పోలీసులు నగరంలో ఉన్న సైబర్ పోలీస్ స్టేషన్లను కోరారు. పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు మరియు ఒక నెల పాటు రాష్ట్రవ్యాప్తంగా నలుగురు లేదా ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడడాన్ని నిషేధించారు. వచ్చే 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేయబడ్డాయి.