రాజస్థాన్ ఉదయపూర్ లో ఒక టైలారింగ్ షాప్ యజమాని కన్హయ్య లాల్ మాజీ బీజేపీ అధికార ప్రతినిధి అయిన నుపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్ పెట్టినందుకు  ఇద్దరు ముస్లిం వ్యక్తులు మంగళవారం మధ్యాహ్నం కస్టమర్ లాగా వచ్చి  షాప్ లో యజమాని తల నరికేశారు.  
ఇవాళ అనగా మంగళవారం 28/06/2022 ఉదయపూర్ మాల్దాస్ స్ట్రీట్‌లోని భూత్ మహల్ సమీపంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిసింది. సుప్రీమ్ టైలర్స్ టైలర్ మరియు యజమాని పట్టపగలు  సందడిగా ఉన్న రోడ్ సమీపంలో ఉన్న ఆయన షాపులో హత్యకు గురయ్యాడు. చుట్టుపక్కన ఉన్న వ్యాపారులు  పిర్యాదు మేరకు ఉదయపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ఢిల్లీ బీజేపీ నాయకుడు తజిందర్ పాల్ పెట్టిన వీడియో ప్రకారం ఇద్దరు ముస్లిం వ్యక్తులు అతడి షాపుకు కస్టమర్ లాగా వెళ్లారు  మరొకడు వీడియో చిత్రీకరిస్తున్నాడు చూడవచ్చు.టైలర్ వ్యక్తి శరీర కొలతలు తీసుకుంటుండగా, అతను అతని మెడ పట్టుకుని వెనుక నుండి దాడి చేశాడు. దీని తరువాత, ఆ వ్యక్తి దర్జీని కొట్టడం ప్రారంభించాడు, బాధితుడు తనను విడిచిపెట్టమని అతనిని వేడుకున్నాడు   

వీడియో యొక్క చివరిలో ఆ ఇద్దరు వ్యక్తులు టైలర్ ను పచ్చ కత్తితో నరికినప్పుడు బాధితుడు ఏడుపు మరియు కేకలు వీడియో తీశారు. అతడిని  అతని దుకాణం బయట ప్లాస్టిక్ కవర్తొ  కప్పి ఉంచారు రక్తం రోడ్ మీద ప్రవహించడం చూడవచ్చు వీడియోలో.
ఆ దుండగులు మరొక వీడియోలో తమ పేర్లు కూడా చెప్పారు ఒకడి పేరు మొహ్మద్ రియాజ్ అఖతారీగా, మరొకడి పేరు మొహ్మద్ గా చెప్పారు.అల్లాహ్ పేరిట తమ చర్యలకు బాధ్యత వహించడాన్ని చూడవచ్చు. “మేము ఉదయ్‌పూర్‌కు చెందిన వ్యక్తి నుండి తలను నరికేశాము. ఓహ్, అల్లా, మేము మీ కోసం జీవిస్తాము మరియు మీ కోసం చనిపోతాము.
"ఓ నరేంద్ర మోడీ మీరు మంటలు పుట్టించారు మేము ఆ మంటలను ఆర్పుతున్నాము ఈ కత్తి మీ మెడకు కూడా చేరుకుంటుంది అన్నారు. అల్లాహ్‌ను అవమానించే వ్యక్తికి ఒకే ఒక్క శిక్ష ఉంటుంది, అది శరీరం నుండి తలను వేరు చేయడం అని ఉదయపూర్ ప్రజలను హెచ్చరించారు.