కుతుబ్మినార్ సమీపంలో ఖువాత్-ఉల్-ఇస్లాం అనే మసీదును 27 దేవాలయాలను కూల్చివేసి నిర్మించారు అనే నిజాన్ని పురావస్తు శాస్త్రవేత్త కెకె మొహ్మద్ బయటపెట్టారు

ఏప్రిల్ 18న భోపాల్లో జరిగిన ప్రపంచ వారసత్వం దినోత్సవం సందర్భంగా జరిగిన సంభాషణల్లో ప్రఖ్యాత ప్రసిద్ధి పొందిన పురావస్తు శాస్త్రవేత్త కెకె మొహ్మద్ మాట్లాడుతూ ఢిల్లీలో కుతుబ్మినార్ సమీపంలో ఉన్న ఖువాత్-ఉల్-ఇస్లాం అనే మసీదును నిర్మించేందుకు 27 దేవాలయాలను కూల్చివేశారు. అలాగే కుతుబ్మినార్ సమీపంలో గణేష్ దేవాలయంతో సహా దేవాలయాల అవశేషాలు కనుకోబడ్డాయి అని తెలిపారు.

ముఖ్యంగా ఢిల్లీ టూరిజం వెబ్సైట్, 73 మీటర్లు ఎత్తైన కుతుబ్మినార్ను 27 హిందూ మరియు జైను  దేవాలయాల నుండి పొందిన వస్తువులను ఉపోయోగించి నిర్మించినట్లు స్పష్టంగా పేర్కొంది. వెబ్‌సైట్ ఇంకా ఇలా చెబుతోంది, “ప్రధాన మసీదు లోపలి మరియు బయటి ప్రాంగణాన్ని కలిగి ఉందని, షాఫ్ట్‌లతో అలంకరించబడింది మరియు చుట్టూ పిల్లర్ ఉంటుందని. ఈ షాఫ్ట్‌లలో ఎక్కువ భాగం 27 హిందూ మరియు జైను దేవాలయాల అవశేషాల మసీదు నిర్మించడానికి దోచుకున్నారని. అందువల్ల, మసీదుకు విలక్షణమైన హిందూ అలంకారాలు ఉండటంలో ఆశ్చర్యం లేదని ఢిల్లీ టూరిజం వెబ్సైట్లో పేర్కొండబడింది.

కెకె మొహ్మద్ మాట్లాడుతూ, ఒకటి కాదు ఆ ప్రాంతంలో చాల వినాయకుడి విగ్రహాలు కనుగున్నట్టు మరియు ఆ ప్రాంతం పృద్విరాజ్ చౌహన్ కాలంలో చౌహాన్ల రాజధానిగా ఉండేదని ఆయన తెలిపారు. దాదాపు 27 దేవాలయాలను ధ్వంసం చేసి అదే అంశాలను ఉపయోగించి ఖువాత్-ఉల్-ఇస్లాం మసీదు నిర్మించినట్టు అరబిక్ భాషలో మసీదు గోడల మీద రాసినట్టు మీరు స్పష్టంగా ఆధారాలు కనుకొనవచ్చు అని చెప్పారు.

గణేశ విగ్రహాలను తొలగించవద్దని ఢిల్లీ కోర్టు ఏఎస్ఐని ఆదేశించింది

ఇటీవల NMA ఆ ప్రాంగణం నుండి గణేష్ విగ్రహాలను వేరే ప్రాంతానికి తరలించాలని చూడగా ఢిల్లీ కోర్టు ఈ ఉత్తర్వు పై స్టే విధించింది. ఆ ప్రాంతం నుండి గణేష్ విగ్రహాలను తొలిగించవద్దని ASI ను ఆదేశించింది.  అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి నిఖిల్ చోప్రా ఈ విష్యం పై కోర్టులో విచారణ జరిగే వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని ASIను కోర్టు ఆదేశించింది. ఈ అంశం పై మే 17న విచారణ జరగనుంది.