యోగి ఆదిత్యనాధ్ గతవారం ఆయన నివాస ప్రాంతంలో మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్స్ పరిమితిని నియంత్రించాలని  ఆదేశాలు జారీ చేసారు. అడిషనల్ చీఫ్ సెక్రటరీ అవనీష్ అవస్తి మాట్లాడుతూ, రాష్ట్రంలో మతపరమైన ప్రదేశాల్లో అక్రమ లౌడ్ స్పీకర్లను తొలిగించాలని శనివారం ఆదేశాలు వచ్చాయి అని దీనికి సంబంధించి ఏప్రిల్ 30లోగ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి సమ్మతి నివేదిక ఇవ్వాలని ఈ ఆదేశాలకు అనుగుణంగా, రాష్ట్రంలో శబ్ద పరిమితికి ప్రమాణాలను ఉల్లంఘించే స్థలాల జాబితాను తయ్యారు చెయ్యాలను స్థానిక పోలీసులను ఆదేశించారు. 

మత పెద్దలతో మాట్లాడి సమన్వయం చేసుకోవడం ద్వారా అనధికార లౌడ్ స్పీకర్లను  తొలిగించొచ్చు అని అవస్తి పోలీసులను ఆదేశించినట్లు తెలియచేసారు. సోమవారం అదనపు డీజీపీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, దాదాపు 125 లౌడ్ స్పీకర్లను తగ్గించామని, దాదాపు 17,000 వేల మంది ప్రజలు  తమకు తాముగా లౌడ్ స్పీకర్లను తగ్గించుకున్నట్టు ఆయన తెలిపారు.

మే నెల్లో ఈద్ మరియు అక్షయ తృతీయ రెండు పండుగలు ఒకే రోజున రాగ ఆ రోజు ఎవరు మతపరమైన ఊరేగింపు సమయంలో లౌడ్ స్పీకర్ల వాడకం ఇతరులకు అసౌకర్యం కలిగించకూడదు అని  పోలీసులు అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లను పెట్టకూడను అని యోగి ఆదేశించారు.