ATTACKS ON HINDU CIVILIZATION
బాబోయ్ మేము ప్రాణాలకు తెగించి ఈ ఉద్యోగాలు చేయలేము, ఈ ఉద్యోగాలు మాకు వద్దు - కాశ్మీరీ పండిట్లు.
ఇస్లామిక్ ఉగ్రవాదులు కాశ్మీర్, బుద్గామ్ చదురాలో రాహుల్ భట్ను లక్షంగా చేసి దారుణంగా హతమార్చిన తరువాత రోజు కాశ్మీర్ లోయ ఆగ్రహంతో చెలరేగింది. భట్ హత్యకు వ్యతిరేఖంగా ఎంతో మంది కాశ్మీరీ హిందువులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేసారు. ప్రధానమంత్రి ఉపాధి ప్యాకేజీ కింద పనిచేస్తున్న సుమారు 350 మంది ఉద్యోగులు ఒకేసారి రాజీనామాలు ఇచ్చేసినట్టు నివేదికలు సూచిస్తున్నాయి.
ఉద్యోగులు తమ రాజీనామాలను లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హాకు పంపినట్టు సమాచారం మరియు అదే కాపీని హోమ్ వ్యవహారాల శాఖకు పంపించారు. రాహుల్ భట్ ను ఉగ్రవాదులు చంపిన తరవాత తాము కూడా సురక్షితంగా లేరు అని లేఖలో పేర్కొన్నారు.
12 సంవత్సరాలుగా కాశ్మీర్ లోయలో ఉద్యోగం చేస్తున్న మైనార్టీ హిందూ ఉద్యోగాలకు రక్షణ కలిపించడంలో ప్రభుత్వం విఫలం అయిందని. పీఎం ప్యాకేజి మరియు నాన్ పీఎం ప్యాకేజి ఉద్యోగులకు సామూహిక రాజీనామాలు చెయ్యటం తప్ప వేరే మార్గం లేదు అని ప్రాణాలు రక్షించుకోవటం కోసమే ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నాము అని లేఖలో పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
0 కామెంట్లు