ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం మథుర లోని శ్రీకృష్ణ జన్మస్థలం ఆలయం దగ్గర ఉన్న సుమారు 37 మద్యం షాపులను, గంజాయి షాపులను మూయించివేసింది.  అలాగే ఆలయానికి 10km లోపు ఉన్న మద్యం షాపుల యజమానుల లైసెన్సును ప్రభుత్వం రద్దు చేసింది.
నివేదికల ప్రకారం బుధవారం నుంచి హోటల్ లో ఉన్న మూడు బార్లను మరియు మోడల్ షాపులు మూసివెయ్యబడ్డాయి.
ప్రభుత్వం  నుండి ఉత్తర్వులు అందుకున్న వెంటనే స్టేట్ ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగి శ్రీకృష్ణ జన్మస్థలం ఆలయం నుండి 10km లోపు ఉన్న అన్ని మాదకద్రవ్య షాపులు, మద్యం దుకాణ దారులు విక్రయాలు ఆపేయాలి అని ఎక్సైజ్ శాఖను  ప్రభుత్వం ఆదేశించింది.
ఈ ఉత్తర్వు జూన్ 1 2022 బుధవారం నుండి అమల్లోకి వస్తుంది అని ప్రభుత్వం తెలిపింది.
శ్రీకృష్ణ జన్మస్థలం ఆలయం నుండి 10km లు మతపరమైన పుణ్యక్షేత్రం అని అందుచేత ఇక్కడ మాంసం,మద్యం, మాదకద్రవ్యాల విక్రయాలు పూర్తిగా నిషేదించాలని యోగి ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించిందని అధికారులు తెలిపారు. ఈ ఉత్తర్వును అనుసరించి అధికారులు జూన్ 1న 2022 బుధవారం చర్యను చేపట్టి శ్రీకృష్ణ జన్మస్థలం ఆలయానికి  10km లోపు ఉన్న 37 షాపులను నిర్ములించాము అని అధికారులు తెలియచేసారు.  
నగరం లోని మొత్తం 22 వార్డులోని , మాదక ద్రవ్యాలను మరియు గంజాయి విక్రయించె  వ్యాపారులు, బర్లులను ఎక్సైజ్ శాఖ మూసివేసింది అని మునిసిపల్ కమిషనర్ అనునై ఝా తెలిపారు. ఎక్కువ మొత్తంలో డైరీ పాలు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన మథురలో 
మద్యం దుకాణ దారులు మద్యానికి పదులు పాలు విక్రయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనలు ఇచ్చింది.
అయోధ్యలో రామమందిరం చుట్టుపక్కల కూడా ఇదే తరహాలో చర్యలు చేపట్టారు.