చండీగఢ్ లో ఇద్దరు శివలింగం పై బీర్ పోస్తూ భోలే బాబా బ్యాక్ గ్రౌండ్ పాట పెట్టారు ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఆ ఇద్దరు యువకులు బూట్లు వేసుకొని  ఒకడు బీరు శివలింగం పై పోస్తున్నాడు మరొకడు ఆపక్కనే కూర్చొని  బీరు తాగుతున్నాడు ఈ వీడియో వీరి సహచరుడు చిత్రీకరించినట్టు సమాచారం. ఆ ఇద్దరి యువకుల పై చర్యను తీసుకోవాలి అంటూ బజరంగ్ దళ్ మరియు బీజేపీ ప్రతినిధులు సమీప ఐటి పార్క్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. 


నివేదికల ప్రకారం  శివలింగం పై బీరు పోస్తున్న వాడిని మరియు సహచరులను  చండీగఢ్ పోలీస్ లు గుర్తించారు. అయితే ఘటన  జరిగిన నీటి వడ్డు  ప్రాంతం బట్టి  చండీగఢ్ లో లేనట్టుగా పోలీసులు నిర్దారించారు 

ఐటి పార్క్ పోలీసుస్టేషన్ ఎస్ హెచ్ ఓ రోహతాష్ యాదవ్ చెప్పిన ప్రకారం ఆ ఘటన అతని అధికార పరిధిలో జరగనట్టు తదుపరి  విచారణకు  ఆ కంప్లైంట్ను  మరియు వీడియోను సైబర్సెల్ కు పంపినట్టు  తెలియచేసారు. 

సేకరించిన సమాచారం ప్రకారం, వీడియోలో నిందితులు పంచకుల వినోద్ కుమార్, మణిమజ్రాకు చెందిన నరేష్ అలియాస్ కాలియా, బాపుధామ్‌కు చెందిన వివేక్. ఇద్దరు నిందితులు వీడియోలో కనిపిస్తుండగా, ఒకరు ఈ చర్యను చిత్రీకరిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో శివభక్తి పాటలు కూడా ప్లే చేయబడ్డాయి. శివలింగంపై మద్యం పోసిన వ్యక్తి నరేష్ అలియాస్ కాలియా. హిందూ సంఘాలు అతడిని గుర్తించినట్లు సమాచారం. అతడు పరారీలో ఉన్నట్లు సమాచారం. హిందూ సంస్థలు కూడా అతని ఇందిరా కాలనీ ఇంటిని సందర్శించాయి, అక్కడ అతను ఇంకా తన ఇంటికి తిరిగి రాలేదని అతని తల్లి చెప్పారు.